Telangana: హైదరాబాద్ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత!

  • వాంతులు, విరేచనాలు చేసుకున్న విద్యార్థులు
  • నీలోఫర్ ఆసుపత్రికి తరలించిన స్కూలు యాజమాన్యం
  • విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం లేదన్న వైద్యులు
హైదరాబాద్ లోని విజయనగర్ కాలనీలో ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాలలో ఈరోజు చాలామంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తినడంతో దాదాపు 30 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో పాఠశాల యాజమాన్యం వీరిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం వీరికి చికిత్స అందజేస్తున్నారు. ఈ విషయమై వైద్యులు మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని తెలిపారు. కలుషిత ఆహారం తినడం వల్లే పిల్లలు అస్వస్థతకు లోనయ్యారని పేర్కొన్నారు.  
Telangana
Hyderabad
minority gurukulam
30 students
got sick
ill

More Telugu News