Telangana: ఒకే కాన్పులో ముగ్గురు మగ పిల్లలు

  • మహబూబాబాద్‌లో ఘటన
  • బరువు తక్కువగా ఉన్న ఇద్దరు శిశువులు
  • ఎంజీఎం ఆసుపత్రికి తరలింపు
నాలుగేళ్ల క్రితం వివాహమైన ఓ మహిళ తాజాగా ఒకే కాన్పులో ముగ్గురు మగ పిల్లలకు జన్మనిచ్చింది. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన. జిల్లాలోని సికింద్రాబాద్‌ తండాకు చెందిన బానోతు సురేశ్‌-రాజేశ్వరి దంపతులు. వీరికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. సంతానం కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న వీరి చూపులు ఇటీవల ఫలించాయి. నిండు గర్భిణి అయిన రాజేశ్వరికి ఆదివారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆసుపత్రిలో చేరగా ముగ్గురు మగ పిల్లలు జన్మించారు. వీరిలో ఇద్దరు పిల్లల బరువు తక్కువగా ఉండడంతో వెంటనే వారిని వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
Telangana
Mahabubabad District
birth

More Telugu News