Congress: రేపు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు తమతో కలుస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన 'కర్ణాటక' రెబెల్స్!

షార్ట్స్‌లో చూడండి
కర్ణాటక రాజకీయ సంక్షోభానికి ఇప్పట్లో తెరపడేట్టు కనిపించడంలేదు. తమ రాజీనామాలను ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కితీసుకోబోమని ముంబయిలో మకాంవేసిన కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు తెగేసి చెప్పారు. పైగా, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు తమతో కలుస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామలింగారెడ్డి, మునిరత్నం, ఆనంద్ సింగ్ కూడా తమ శిబిరంలో చేరుతున్నారని తిరుగుబాటు ఎమ్మెల్యేలు వెల్లడించారు. ఎల్లుండి వరకు తాము ముంబయిలోనే ఉంటామని వారు స్పష్టం చేశారు. అసంతృప్త ఎమ్మెల్యేలైన సోమశేఖర, గోపాలయ్య, బీసీ పటేల్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా పైవ్యాఖ్యలు చేశారు. శాసనసభ్యత్వానికి మొత్తం 13 మంది రాజీనామా చేశారని వెల్లడించారు. ముఖ్యమంత్రిని మార్చాలని తామేమీ డిమాండ్ చేయలేదని, సుస్థిరప్రభుత్వం కోసమే తమ ప్రయత్నమని చెప్పారు.
Go Back to Shorts
Congress
Karnataka
Mumbai

More Telugu News