Karnataka: కర్ణాటక సంక్షోభానికి కారణం రాహుల్ గాంధీ నిర్ణయాలే: బీజేపీ నేత మురళీధర్ రావు

  • కర్ణాటక రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నాం
  • ఇక్కడి సంక్షోభానికి మేము కారణం కాదు
  • కొత్త ప్రభుత్వం ఏర్పడి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంది
కర్ణాటక సంక్షోభానికి కారణం రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాలేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఆరోపించారు. ఈరోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ, కర్ణాటకలో రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, సరైన సందర్భంలో కరెక్టు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వంలో సంక్షోభానికి తాము కారణం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీి నాయకత్వమూ, దశాదిశా లేకుండా పనిచేస్తోందని విమర్శించారు.

ఎమ్మెల్యేల రాజీనామాలతో కర్ణాటక ప్రభుత్వం మైనార్టీలో పడిందని, స్పీకర్ దీనిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్టు చెప్పారు. గవర్నర్, కోర్టులు అన్ని విషయాలు గమనిస్తున్నాయని అన్నారు. అవకాశవాదంతో కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని విమర్శించారు. వీలైనంత త్వరగా కర్ణాటక సంక్షోభానికి తెరపడాలని, కొత్త ప్రభుత్వం ఏర్పడి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని మురళీధర్ రావు ఆకాంక్షించారు.
Karnataka
congress
Jds
bjp
muralidhar rao

More Telugu News