సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత ధర్మపురి అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు!
- తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది
- కుటుంబపాలనకు స్వస్తి పలకాలి
- కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు
ఆవాస్ యోజన కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణాకు ఇచ్చిన నిధులను కమిషన్ వచ్చే ప్రాజెక్టుల కోసం ఈ ప్రభుత్వం మళ్లిస్తోందని ఆరోపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పథకం ‘ఆయుష్మాన్ భవ’ను అమలు చేయడం లేదని విమర్శించారు. పసుపు రైతుల ఇబ్బందుల తీర్చే రోజు దగ్గరకు వచ్చిందని, ఆ సమస్యను పరిష్కరించిన రోజున టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ తమ నెత్తిపై గుడ్డ వేసుకుని కూర్చోవాల్సి వస్తుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.