Allu Arjun: తనను పిలవకుండా తన సిబ్బంది వీకెండ్ పార్టీ చేసుకోవడంపై అల్లు అర్జున్ వ్యాఖ్యలు

  • సోషల్ మీడియాలో పోస్టు
  • తనను కూడా పిలవొచ్చు కదా అంటూ కామెంట్
  • అందరి దృష్టిని ఆకర్షిస్తున్న బన్నీ పోస్టు
టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ వద్ద చాలా మంది సిబ్బంది పనిచేస్తుంటారు. తన టీమ్ అంటూ తన వద్ద పనిచేసే స్టాఫ్ గురించి అల్లు అర్జున్ పలు సందర్భాల్లో ప్రస్తావిస్తుంటారు. అయితే, తాజాగా ఆయన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఓ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దాని గురించి అల్లు అర్జునే కామెంట్ కూడా చేశారు. "ఆదివారం ఉదయం నా ఆఫీసులో మొదటగా కనిపించేది గత రాత్రి అక్కడ పార్టీ జరిగిన విషయమే. ప్రతి శనివారం రాత్రి నా స్టాఫ్ బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ల నైట్ లైఫ్ నాకంటే చాలా విభిన్నంగా ఉంటుందనిపిస్తుంది. వాళ్లు నన్ను కూడా పిలవొచ్చు కదా!" అంటూ వ్యాఖ్యానించారు.
Allu Arjun
Tollywood
Staff

More Telugu News