Crime News: గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో గాయపడిన వ్యాపారి రాంప్రసాద్‌ మృతి

షార్ట్స్‌లో చూడండి
గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ వ్యాపారి రాంప్రసాద్‌ ఈరోజు తెల్లవారు జామున చనిపోయారు. నిన్నరాత్రి పంజాగుట్ట వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి వస్తుండగా మాటువేసిన దుండగులు కత్తులతో దాడిచేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాంప్రసాద్‌ను సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ  మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రాంప్రసాద్‌కు విజయవాడలో ఓ స్టీల్‌ ప్లాంట్‌ ఉందని, గతంతో ఈ ఫ్యాక్టరీలో భాగస్వామి అయిన కోగంటి సత్యం అనే వ్యక్తితో భాగస్వామ్యం ఉండేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భాగస్వామ్యం రద్దు చేసుకున్నాక సత్యం నుంచి తరచూ బెదిరింపు ఫోన్లు వస్తుండేవని, అతనే కిరాయి హంతకులతో ఈ హత్య చేయించి ఉంటాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాంప్రసాద్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆధారాల కోసం వేంకటేశ్వరస్వామి ఆలయంలోని సీసీ కెమెరాల పుటేజీ పరిశీలిస్తున్నారు.
Go Back to Shorts
Crime News
man rided
died in hospital

More Telugu News