BJP: బీజేపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త శిద్దా వెంకటేశ్వరరావు

  • అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీలో చేరిక
  • పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానన్న శిద్దా
  • హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తానంటూ వ్యాఖ్య
ఇరు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్, ఒంగోలు డెయిరీ మాజీ ఛైర్మన్ శిద్దా వెంకటేశ్వరరావు బీజేపీలో చేరారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో హైదరాబాదులో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శిద్దాను అమిత్ షా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా శిద్దా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి, హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తానని తెలిపారు. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కూడా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
BJP
Sidda Venkateswara Rao
Amitabh Bachchan

More Telugu News