VK Singh: జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ కు స్థాన చలనం

  • వీకే సింగ్ ను బదిలీ చేసిన ప్రభుత్వం
  • ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా నియామకం
  • వీకే సింగ్ స్థానంలో సందీప్ శాండిల్యకు పోస్టింగ్
తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వీకే సింగ్ ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2014 జూన్ 6వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఐదేళ్లకు పైగా జైళ్ల శాఖ డీజీగా వీకే సింగ్ బాధ్యతలను నిర్వహించారు. మరోవైపు, జైళ్ల శాఖ కొత్త డైరెక్టర్ జనరల్ గా సందీప్ శాండిల్యను నియమించింది. ఇప్పటి వరకు రైల్వే డీజీగా శాండిల్య ఉన్నారు.
VK Singh
IPS
Transfer
Telangana
Sandeep Sandilya

More Telugu News