Amit Shah: 2024లో తెలంగాణలో మాదే అధికారం. ఏపీలోనూ బలపడతాం: అమిత్ షా

  • తెలంగాణలో అతిపెద్ద పార్టీగా అవతరించబోతున్నాం
  • బీజేపీతోనే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయి
  • కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు
సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన బీజేపీ... సింహనాదం చేస్తోంది. యావత్ దేశంలో పాగా వేస్తామనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్త పరుస్తోంది. ఈ నేపథ్యంలో, 2024లో తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. శంషాబాద్ లో నిన్న జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ, రాష్ట్రంలో బీజేపీకి రోజురోజుకూ బలం పెరుగుతోందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని అన్నారు. బీజేపీతోనే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయని చెప్పారు. తెలంగాణలో 20 లక్షల సభ్యత్వాలే తమ లక్ష్యమని అన్నారు. ఏపీ, కేరళలలో కూడా బీజేపీ బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కింది స్థాయి నాయకుడు సైతం ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. బీజేపీని తేలికగా చూసిన కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు.
Amit Shah
BJP
Telangana
AP
Congress

More Telugu News