అప్పుడే మోదీ ఆహ్వానించారు కానీ నా కుమారుడు స్పీకర్గా ఉండటంతో తిరస్కరించా: నాదెండ్ల
- ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తా
- పార్టీ ఆదేశిస్తే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధం
- నా కుమారుడి రాజకీయ జీవితం అతని వ్యక్తిగతం
తనకు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానని నాదెండ్ల తెలిపారు. తన కుమారుడి రాజకీయ జీవితం అతని వ్యక్తిగమని, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే హక్కు అతనికి ఉందని అన్నారు. కాంగ్రెస్ ఇక మీదట కోలుకోవడం కష్టమన్నారు. తనను మోదీ 2014లోనే బీజేపీలోకి ఆహ్వానించారని, కానీ తన కుమారుడు స్పీకర్ పదవిలో ఉన్నందున తాను తిరస్కరించాల్సి వచ్చిందని నాదెండ్ల స్పష్టం చేశారు.