Raklul Preet: చిల్లర డబ్బుల కోసం రకుల్ ప్రీత్ సింగ్ జేబుల్లో చేతులు పెట్టిన బిచ్చగత్తెలు!

  • ముంబయిలో ఘటన
  • రెస్టారెంట్ వెలుపల రకుల్ కు చుక్కలు చూపించిన బెగ్గర్స్
  • కార్లో కూర్చోబోతుండగా కూడా అడ్డుకున్న వైనం
 ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ కు ముంబయిలో ఊహించని అనుభవం ఎదురైంది. కొందరు బిచ్చగత్తెలు రకుల్ ను చుట్టుముట్టి ఆమెను బాగా ఇబ్బందికి గురిచేశారు. ముంబయిలోని ఓ రెస్టారెంట్ నుంచి బయటికి వచ్చి తన కారు కోసం చూస్తున్న రకుల్ ప్రీత్ ను ఒక్కసారిగా కొందరు బెగ్గర్స్ చుట్టుముట్టారు. చిన్నారుల నుంచి టీనేజ్ అమ్మాయిల వరకు ఆ బిచ్చగత్తెల బృందంలో ఉన్నారు. పొట్టి దుస్తుల్లో ఉన్న రకుల్ ప్రీత్ ను డబ్బులు అడిగిన ఆ బిచ్చగత్తెలు, ఆపై ఆమె జేబుల్లో చేతులు పెట్టి మరీ డబ్బుల కోసం వెంపర్లాడారు. కారు డోర్ తీసి కూర్చోబోతున్న సమయంలోనూ ఆమెను వదల్లేదా బిచ్చగత్తెలు. చివరికి రకుల్ ఎలాగోలా కార్లో కూర్చుని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది.

Raklul Preet
Mumbai
Tollywood
Bollywood

More Telugu News