Dasoju Sravan: అప్పుడు టీడీపీపై కేసులు పెట్టిన మీరు.. ఇప్పుడు జయేష్ రంజన్‌పై కేసు పెడుతున్నారా?: దాసోజు శ్రవణ్

  • ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరిస్తామనడం సబబేనా?
  • ప్రజల అనుమతి లేకుండా ఎలా క్రోడీకరించారు?
  • ప్రజల నుంచి ఎలాంటి వివరాలు సేకరించారో చెప్పాలి
ప్రైవేటు వ్యక్తుల చేతికి ప్రజల డేటా వెళ్లకుండా ప్రభుత్వం తీసుకునే జాగ్రత్తలేంటో చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజల వ్యక్తిగత సమాచారం ఇస్తామని ఐటీ సెక్రటరీ  చెప్పడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.

సమాచారాన్ని ప్రజల అనుమతి లేకుండా ఎలా క్రోడీకరించారు? పౌరుల అనుమతి తీసుకున్నారా? అంటూ మండిపడ్డారు. ప్రజల నుంచి ప్రభుత్వం ఎలాంటి వివరాలు సేకరించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రజల సమాచారాన్ని టీడీపీ చోరీ చేసిందని కేసులు పెట్టిన విషయాన్ని శ్రవణ్ గుర్తు చేశారు. ప్రస్తుతం ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్‌పై కేసు పెడుతున్నారా? అని శ్రవణ్ నిలదీశారు.
Dasoju Sravan
Jayesh Ranjan
Congress
Telugudesam
IT Secretary

More Telugu News