Mohanbabu: అందరి కోరికలూ తీరుతాయి: తిరుమలలో మోహన్ బాబు

  • తిరుమలకు వచ్చిన మోహన్ బాబు
  • సీఎంగా జగన్ చక్కగా పనిచేస్తున్నారని కితాబు
  • రాష్ట్రం అభివృద్ధి అవుతుందన్న మోహన్ బాబు
తెలుగు ప్రజల అందరి కోరికలు, ఆకాంక్షలు తీరనున్నాయని ప్రముఖ నటుడు మోహన్ బాబు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చి స్వామి వారి దర్శనం చేసుకున్న అయన, అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, సీఎంగా చక్కగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. జగన్ పాలన అన్ని వర్గాల ప్రజలకూ నచ్చుతుందని నమ్ముతున్నట్టు తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని తాను కోరుకుంటున్నానని, జగన్ దాన్ని సాధిస్తారన్న నమ్మకం తనకుందని మోహన్ బాబు చెప్పారు.
Mohanbabu
Tirumala
Jagan
Andhra Pradesh

More Telugu News