kcr: హిందూయిజం పేరుతో కేసీఆర్‌ను ఓడించలేరు: అసదుద్దీన్

  • బీజేపీ కల నెరవేరదు
  • మోదీ కంటే కేసీఆరే దృఢమైన భారతీయుడు
  • హిందూత్వానికి మేం వ్యతిరేకం కాదు
హిందూయిజం పేరుతో కేసీఆర్‌ను బీజేపీ ఓడించలేదని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ కంటే కేసీఆరే దృఢమైన హిందువు అని తేల్చిచెప్పారు. మోదీ రెండు దేవాలయాలను సందర్శిస్తే, కేసీఆర్ ఆరు దేవాలయాలను సందర్శిస్తారని అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ఆ పార్టీ నేతల కలలు కల్లలుగానే ఉండిపోతాయని అసద్ పేర్కొన్నారు. తాము హిందూయిజానికి వ్యతిరేకం కాదని, హిందూత్వ విధానాలను మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని ఒవైసీ అన్నారు. కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌ షా నేడు నగరానికి రానున్న నేపథ్యంలో అసద్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
kcr
asduddin owaisi
Amit Shah
Hyderabad
Hindutva

More Telugu News