Andhra Pradesh: కేంద్రం ఇప్పటికైనా మా సిఫారసులు అమలు చేయడం అభినందనీయం: చంద్రబాబు

  • డిజిటల్ చెల్లింపులపై పన్ను ఎత్తివేత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
  • గతంలో నేను చేసిన సిఫారసుల్లో ఇదే కీలకం
  • డిజిటల్ చెల్లింపులు వృద్ధి చెందే అవకాశం 
పార్లమెంట్ లో ఈరోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. వేతన జీవులు, మధ్యతరగతి ప్రజలను ఈ బడ్జెట్ నిరాశకు గురి చేసిందని అన్నారు. అయితే, డిజిటల్ చెల్లింపులపై పన్ను ఎత్తివేయాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. గతంలో సంబంధిత కమిటీకి తాను చైర్మన్ గా ఉన్నప్పుడు చేసిన సిఫారసుల్లో ఇదే కీలకాంశమని చంద్రబాబు గుర్తుచేశారు. దీని అమల్లో తీవ్ర జాప్యం జరిగినా, ఇప్పటికైనా కేంద్రం అమలు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సిఫారసు అమలు ద్వారా బ్యాంకు లావాదేవీల్లో పారదర్శకతతో పాటు డిజిటల్ చెల్లింపులు వృద్ధి చెందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. 
Andhra Pradesh
Telugudesam
Chandrababu
Budget

More Telugu News