Andhra Pradesh: టీడీపీ కార్యకర్త పద్మ మృతికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?: టీడీపీ అధినేత చంద్రబాబు

  • పద్మ కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు 
  • ఆమె మృతికి నా ప్రగాఢ సానుభూతి
  • టీడీపీ తరపున రూ.5 లక్షల ఆర్థికసాయం
ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలోని రుద్రమాంబపురంలో టీడీపీ మహిళా కార్యకర్త పద్మ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. పద్మ కుటుంబాన్ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈరోజు పరామర్శించి, ధైర్యం చెప్పారు. టీడీపీ తరపున రూ.5 లక్షల ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, టీడీపీ కార్యకర్త పద్మ మృతికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.

ఆరోజున ఇంట్లో ఉన్న పద్మను నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి దాడి చేశారని, ఆమెను వివస్త్రను చేసి దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పద్మ మృతిపై సరైన విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పద్మకు జరిగిన అవమానంపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావని ప్రభుత్వం భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Andhra Pradesh
Prakasam District
china ganjam
Telugudesam

More Telugu News