Andhra Pradesh: ఏపీకి మేలు చేసే ఏ ఒక్క అంశాన్నీ ప్రస్తావించలేదు: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి

  • రాష్ట్ర ప్రజల డిమాండ్ ప్రత్యేక హోదా
  • విభజన చట్టంలోని హామీలపై కేంద్రం వివరణ ఇవ్వలేదు
  • రాష్ట్రానికి రావాల్సిన వాటాలు, హామీలపై పోరాడతాం
ఏపీకి మేలు చేసే ఏ ఒక్క అంశాన్నీ కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావించలేదని వైసీపీ లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల డిమాండ్ ప్రత్యేక హోదాపై బడ్జెట్ లో ప్రస్తావనే లేదని, విభజన చట్టంలోని హామీలపై కేంద్రం వివరణ ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన వాటాలు, హామీల గురించి వైసీపీ గట్టిగా పోరాడుతుందని చెప్పారు. ఉపాధిహామీ పథకం కింద ప్రస్తుత బడ్జెట్ లో రూ.60 వేల కోట్లు కేటాయించారని, ఇందులో అత్యధిక వాటా ఏపీకి వచ్చేలా పట్టుబడతామని అన్నారు.
Andhra Pradesh
YSRCP
mp
Mithun Reddy

More Telugu News