Central Budget: బడ్జెట్ లో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపారు: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి

  • ఈ విషయమై దక్షిణాది రాష్ట్రాల నేతలు ఆలోచించాలి
  • కేంద్ర వైఖరిని ఖండించాలి
  • తెలంగాణకి అన్యాయం జరుగుతున్నా కేసీఆర్ నోరుమెదపట్లేదు
కేంద్ర బడ్జెట్ లో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపారని టీ- కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ బడ్జెట్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తర భారత నాయకుల వివక్ష స్పష్టంగా అర్థమవుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై దక్షిణాది రాష్ట్రాల నేతలు ఆలోచించాలని, కేంద్ర వైఖరిని ఖండించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా సీఎం కేసీఆర్ తన వ్యక్తిగత కేసులకు భయపడి నోరు మెదపడం లేదని, టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడటం లేదని ఆరోపించారు. దక్షిణాదికి చెందిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మ అయ్యారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ లో ఐటీకి సంబంధించి పేద, మధ్య తరగతి వారికి ఎలాంటి ఉపశమనం ఇవ్వలేదని, విద్య, ఉద్యోగాల్లో ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చే పథకాలు లేవని అభిప్రాయపడ్డారు.
Central Budget
Congress
mp
Revanth reddy

More Telugu News