ఈ బడ్జెట్ వల్ల ఏ రాష్ట్రానికీ ఉపయోగం లేదు: టీఆర్ఎస్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి
- ప్రజలకు మేలు చేసే ప్రకటనలు లేవు
- విభజన చట్టంలోని హామీలకు ప్రతిపాదనలు లేవు
- తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపించింది
విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క హామీకి బడ్జెట్లో ప్రతిపాదనలు లేవని మండిపడ్డారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపించిందని అన్నారు. టీఆర్ఎస్ మరో ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, మిషన్ భగీరథకు ఆర్థికసాయం చేసి ఉంటే బాగుండేదని చెప్పారు. బంగారంపై సుంకాన్ని పెంచారని... దీని వల్ల సామాన్యులకు ఇబ్బంది అని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బడ్జెట్ ఉందని చెప్పారు.