Rahul Gandhi: వర్షాలతో ముంబై మునిగిపోతుంటే మీరెక్కడున్నారు?: పార్టీ నేతలపై రాహుల్ ఫైర్

  • పరువునష్టం కేసులో కోర్టుకు హారైన రాహుల్
  • పార్టీ నేతలతో సమావేశం
  • పార్టీ బలోపేతానికి సలహాలు, సూచనలు స్వీకరణ
భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం అవుతుంటే మీరెక్కడున్నారంటూ కాంగ్రెస్ నేతలపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. పరువునష్టం కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు ముంబై వచ్చిన రాహుల్‌ను పార్టీ నేతలు కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా నేతలపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారీ వర్షాలతో నగరం అతలాకుతలం అవుతుంటే మీరెక్కడున్నారని ప్రశ్నించారు. ఓ పార్టీ నేతలుగా వీధుల్లోకి వెళ్లి బాధితులకు సాయం అందించాల్సిన బాధ్యత మనపై ఉందని హితబోధ చేశారు. పార్టీ పటిష్టం కావాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుండాలని, ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. పొత్తుల గురించి ఆలోచించకుండా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. పార్టీని మరింత పటిష్టంగా తీర్చిదిద్దాలంటే ఏం చేయాలో చెప్పాలంటూ నేతలను సలహాలు, సూచనలు అడిగారు.
Rahul Gandhi
Congress
Maharashtra
mumbai
court

More Telugu News