Hyderabad: వికారాబాద్‌లో బైక్ రేసింగ్.. హైదరాబాద్ యువకుడి దుర్మరణం

  • ఇటీవలే అమెరికా నుంచి నగరానికి
  • స్నేహితులతో కలిసి రిసార్టుకు
  • వీడియో వైరల్ కావడంతో వెలుగు చూసిన ఘటన
వికారాబాద్‌లో జరిగిన మౌంటైన్ బైక్ రేసింగ్‌లో హైదరాబాద్‌కు చెందిన ఎన్నారై ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 1న ఈ ఘటన జరగ్గా సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో ఉంటున్న హైదరాబాద్‌కు చెందిన అరవింద్ ఇటీవల నగరానికి వచ్చాడు. స్నేహితులతో కలిసి వికారాబాద్ జిల్లా గోధుమగూడ సమీపంలోని ఓ రిసార్టులో మౌంటైన్ బైక్ రేసింగ్‌కు వెళ్లాడు. రేసింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో తీవ్ర గాయాలపాలైన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  
Hyderabad
Vikarabad District
bike racing
NRI

More Telugu News