Andhra Pradesh: ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయి నియామకాన్ని రద్దు చేసిన ప్రభుత్వం!

  • ఇటీవలే ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయి నియామకం
  • తాజాగా ఉత్తర్వులు వెనక్కి తీసుకున్న సర్కారు
  • వెల్లడికాని కారణాలు
వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఇటీవలే ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడా నియామకం రద్దయింది. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయి నియామకాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. విజయసాయి నియామకాన్ని జగన్ సర్కారు వెనక్కి తీసుకోవడానికి గల కారణాలను విశ్లేషిస్తే, ఆయన ఎంపీగా కొనసాగుతుండడమే అవరోధమని తెలుస్తోంది. విజయసాయి స్థానంలో త్వరలోనే మరొకరిని నియమించనున్నట్టు సమాచారం.
Andhra Pradesh
Vijay Sai Reddy
YSRCP
New Delhi

More Telugu News