nara lokesh: జగన్ గారూ.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు?: నారా లోకేశ్

  • ఇప్పుడు మీరు ఏపీకి ముఖ్యమంత్రి 
  • సాక్షి పేపర్ చదవడం మానేయండి
  • అధికారులతో మాట్లాడితే నిజాలు తెలుస్తాయి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి టార్గెట్ చేశారు. ప్రజాధనంతో అన్ని సౌకర్యాలు ఉన్న ఇళ్లను పేదవారికి కట్టించడం తప్పు అని మీరు అనడం సబబు కాదని అన్నారు. తమరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రని... ఇకనైనా సాక్షి పేపర్ ను చదవడం మాని, పక్కన ఉన్న అధికారులతో మాట్లాడితే నిజాలు తెలుస్తాయని ఎద్దేవా చేశారు. మీకు అది కూడా ఇష్టం లేకపోతే వివరాలు ఇవిగో అంటూ కొన్న వివరాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

'సరదాగా కొంత సమయం గడపడానికి బెంగుళూరులో ప్యాలస్ నిర్మించుకోవచ్చు. అమరావతిలో నివాసం కోసం రాజ భవనం కట్టుకోవచ్చు. హైదరాబాదులో పాండ్ ను మింగి... లోటస్ లాంటి భవనాన్ని నిర్మించుకోవచ్చు. పేదవాడు మాత్రం కూలిపోయే ఇందిరమ్మ ఇళ్లలోనే ఎప్పుడూ ఉండిపోవాలి' అని ట్వీట్ చేశారు. జగన్ గారూ, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారంటూ ప్రశ్నించారు.
nara lokesh
jagan
ysrcp
Telugudesam

More Telugu News