ashok babu: అవినీతి రాజ్యానికి రాజు జగన్.. వైసీపీ అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదం: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు

  • రాజీవ్ గృహకల్పపై కూడా విచారిస్తే బాగుంటుంది
  • పేదలు పాత ఇళ్లలోనే ఉండాలనేది మీ కోరికా?
  • పేదవారిని చులకనగా చూడొద్దు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతి సామ్రాజ్యానికి జగన్ రాజు అని... అవినీతి గురించి వైసీపీ వాళ్లు మాట్లాడటం హాస్యాస్పదం అని అన్నారు. ఇళ్ల నిర్మాణంలో షేర్ వాల్ టెక్నాలజీ సరైనది కాదని వైసీపీ చెప్పగలదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన రాజీవ్ గృహకల్పపై కూడా విచారిస్తే బాగుంటుందని అన్నారు. 2004 నుంచి 2019 వరకు విచారిస్తే తాము స్వాగతిస్తామని చెప్పారు. పేదలు పాత ఇళ్లలోనే ఉండాలనేది మీ కోరికా? అని జగన్ ను ప్రశ్నించారు. పేదవాళ్లను చులకనగా చూడవద్దని సూచించారు.
ashok babu
Jagan
Telugudesam
ysrcp
housing

More Telugu News