udayanidhi: కుమారుడికి కీలక బాధ్యతలను అప్పగించనున్న స్టాలిన్!

షార్ట్స్‌లో చూడండి
తన కుమారుడు ఉదయనిధికి పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించేందుకు డీఎంకే అధినేత స్టాలిన్ సిద్ధమయ్యారు. ఇంతకుముందు 35 ఏళ్ల పాటు తాను సుదీర్ఘంగా నిర్వహించిన పార్టీ యూత్ వింగ్ సెక్రటరీ బాధ్యతలను కుమారుడికి అప్పగించనున్నారు. ఈ సాయంత్రం ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని డీఎంకే నేత ఒకరు చెప్పారు. యూత్ వింగ్ సెక్రటరీ పదవిని తాత అయిన తర్వాత కూడా స్టాలిన్ నిర్వహించారు.

42 ఏళ్ల ఉదయనిధి పలు సినిమాల్లో హీరోగా నటించారు. అంతేకాదు తన కుటుంబం నిర్వహించే మురసోలి ట్రస్టుకు ఎండీగా వ్యవహరిస్తున్నారు. డీఎంకే యూత్ వింగ్ సెక్రటరీ బాధ్యతల నుంచి వెల్లకోవిల్ స్వామినాథన్ గత నెలలో తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు.

ఈ సందర్భంగా డీఎంకే నేత ఒకరు మాట్లాడుతూ, ఉదయనిధి నియామకం వెనుక బంధుప్రీతి లేదని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉదయనిధి విస్తృతంగా ప్రచారం నిర్వహించారని... తన తండ్రి మాదిరే నాయకత్వ లక్షణాలను చాటుకున్నారని తెలిపారు. అతని పనికి గుర్తింపుగానే పదవిని అప్పగిస్తున్నట్టు చెప్పారు.
Go Back to Shorts
udayanidhi
dmk
stalin

More Telugu News