KPHB: కూకట్ పల్లిలో 25 ఏళ్ల వ్యక్తి దారుణ హత్య

  • కళామందిర్ రోడ్డులోని ఓ గదిలో హత్య
  • సెంట్రింగ్ పనుల కోసం ఉపయోగించే కర్రలతో తలపై కొట్టి హత్య
  • దర్యాప్తు చేపట్టిన పోలీసులు

హైదరాబాదులోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. కళామందిర్ రోడ్డులో ఉన్న ఓ గదిలో 25 ఏళ్ల యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. నిర్మానుష్య ప్రాంతంలో నిర్మించిన ఈ గదిలో సెంట్రింగ్ కోసం ఉపయోగించే కర్రలతో తలపై కొట్టి దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

More Telugu News