Andhra Pradesh: రాష్ట్రంలో వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది: చంద్రబాబునాయుడు

  • అధికార పార్టీ నిర్ణయాలపై వ్యతిరేకత వచ్చింది
  • ప్రజల్లో అప్పుడే నిరసన వెల్లువెత్తుతోంది
  • అధికారం కోసం అమలు కాని హామీలు ఇచ్చారు
ఏపీలో అధికార పార్టీ నిర్ణయాలపై నెలరోజుల్లోనే వ్యతిరేకత వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగింది.

ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తల భేటీలో పార్టీ నాయకులతో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు. 2024లో తమ పార్టీకే అధికారం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. పెన్షన్లు, విత్తనాలు, విద్యుత్ ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, ప్రజల్లో అప్పుడే నిరసన వెల్లువెత్తుతోందని అన్నారు. జగన్ అధికారంలోకి రావడం కోసం అమలు కాని హామీలు ఇచ్చారని, అవే వారికి శాపంగా మారబోతున్నాయని వ్యాఖ్యానించారు. 
Andhra Pradesh
Telugudesam
Chandrababu
cm
jagan

More Telugu News