Chittoor District: ఓడినప్పుడు అధైర్యపడొద్దు, అది నాయకత్వ లక్షణం కాదు: చంద్రబాబు

  • కుప్పం టీడీపీ కార్యాలయంలో సమీక్ష
  • కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు
  • ఎన్నికల్లో ఓడినప్పుడు అధైర్యపడొద్దన్న బాబు
పార్టీ ఫిరాయింపుదారులపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం టీడీపీ కార్యాలయంలో ఈరోజు సమీక్షించారు. ఎన్నికల్లో ఆధిక్యం తగ్గడంపై పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, స్వలాభం కోసం పార్టీ మారితే అవకాశవాదం అవుతుందని అన్నారు.

నియోజకవర్గంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన విధివిధానాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఓడినప్పుడు అధైర్యపడొద్దని, అది నాయకత్వ లక్షణం కాదని సూచించారు. తెలుగుదేశం కుటుంబసభ్యులెవరూ అధైర్యపడొద్దని వారికి అండగా ఉంటానని, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని, ఏ విధంగా ముందుకు నడిపించాలో ఆ విధంగా ముందుకెళ్తానని చంద్రబాబు అన్నారు. 
Chittoor District
kuppam
Telugudesam
Chandrababu

More Telugu News