Rahul Gandhi: ఇకపై నేను పార్టీ అధ్యక్షుడిని కాదు.. తక్షణమే మరో అధ్యక్షుడిని ఎంపిక చేయండి: రాహుల్ గాంధీ

  • అధ్యక్ష పదవికి ఇప్పటికే రాజీనామా చేశా
  • సీడబ్ల్యూసీ వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలి
  • కొత్త అధ్యక్షుడిపై నిర్ణయం తీసుకోవాలి
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తనకు వద్దని చెప్పిన రాహుల్ గాంధీ... పట్టు విడవడం లేదు. ఇకపై తాను పార్టీ అధ్యక్షుడిని కాదని... ఆలస్యం చేయకుండా తక్షణమే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని పార్టీ నాయకులను కోరారు. అధ్యక్ష పదవికి తాను ఇప్పటికే రాజీనామా చేశానని చెప్పారు. సీడబ్ల్యూసీ వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, కొత్త అధ్యక్షుడిని నిర్ణయించాలని విన్నవించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామాను ఉపసంహరించుకోవాలని పార్టీ సీనియర్ నేతలంతా కోరుతున్నప్పటికీ ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు.
Rahul Gandhi
congress
president
resign

More Telugu News