Andhra Pradesh: తిరుమలలో దొంగలు.. ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి బంధువుల గదిలో చోరీ!

  • స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లిన కుటుంబం
  • గదిలోని రూ.2 లక్షల నగదు, బంగారం, సెల్ ఫోన్ తస్కరణ
  • సాక్ష్యాలు సేకరించిన క్లూస్ టీం
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి బంధువులకు దొంగలు షాక్ ఇచ్చారు. గౌతం రెడ్డి బంధువులు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలలోని మణిమంజరి అతిథిగృహంలో దిగారు. ఈరోజు తెల్లవారుజామున కుటుంబ సభ్యులు అంతా స్వామివారి దర్శనం కోసం వెళ్లగా, గుర్తుతెలియని దుండగులు గదిలోకి చొరబడి రూ.2 లక్షల నగదు, 100 గ్రాముల బంగారం, సెల్ ఫోన్ ను ఎత్తుకెళ్లారు.

దర్శనం అనంతరం గదికి వచ్చిన బంధువులు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేశారు. క్లూస్ టీం సాయంతో సాక్ష్యాలను సేకరించారు. వీలైనంత త్వరగా దొంగలను పట్టుకుంటామని చెప్పారు.
Andhra Pradesh
Tirumala
theft

More Telugu News