swaroopanandendra: టీడీపీపై మరోసారి విమర్శలు చేసిన స్వరూపానందేంద్ర

  • గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనం దుర్వినియోగమైంది
  • పుష్కరాలు, నదీ హారతులకు నిధులను దుర్వినియోగం చేశారు
  • విచారణ జరిపించాలని జగన్ ను కోరతా
ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎంతో ఆప్తుడైన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర... టీడీపీపై అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తారనే విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి టీడీపీపై మండిపడ్డారు. సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని ఈరోజు ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, నదీ హారతులు, పుష్కరాలు, పథకాల పేరుతో గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఈ దుర్వినియోగంపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని సీఎం జగన్ ను కోరతానని చెప్పారు.
swaroopanandendra
Telugudesam
ysrcp
jagan

More Telugu News