isro: చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించిన ఇస్రో.. ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్

షార్ట్స్‌లో చూడండి
శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు చిమ్ముతూ నింగికెగసే రాకెట్లను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా మనం ఎన్నో సార్లు వీక్షించాం. అయితే, షార్ కు వెళ్లి ప్రత్యక్షంగా ఈ ప్రయోగాలను వీక్షించాలనే కోరిక మనలో దాదాపు అందరికీ ఉంటుంది. మన కోరికను నెరవేర్చే దిశగా ఇస్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్-2 ప్రయోగాన్ని చూసే అవకాశాన్ని కల్పించింది.

ఈ నెల 12వ తేదీ తెల్లవారుజామున 2.51 నిమిషాలకు చంద్రయాన్-2 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు 10 వేల మంది ప్రజలకు ఇస్రో అవకాశం కల్పించింది. రేపు (4వ తేదీ) అర్ధరాత్రి (00.00 గంటలు) నుంచి ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకునేవారు ఇస్రో వెబ్ సైట్ www.isro.gov.in లో వారి పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి ఆన్ లైన్ లోనే అనుమతి ఇవ్వనున్నట్టు ఇస్రో ప్రకటించింది.
Go Back to Shorts
isro
chandrayan-2
live witness
registration

More Telugu News