Andhra Pradesh: ఏపీ హోం మంత్రి సుచరితపై అభ్యంతరకర పోస్టు.. యువకుడి అరెస్టు

  • ‘ఫేస్ బుక్’ వేదికగా సుచరితపై అభ్యంతరకర పోస్టు
  • విశాఖ జిల్లాకి చెందిన యువకుడు రాము అరెస్టు
  • రామ్ మహరాజ్ పేరుతో ఖాతా నిర్వహిస్తున్న రాము  
ఏపీ హోం శాఖ మంత్రి సుచరితపై అభ్యంతరకర పోస్టు చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ‘ఫేస్ బుక్’ వేదికగా ఆమెపై అభ్యంతరకర పోస్టు చేసిన యువకుడి పేరు రాము అని, అతను విశాఖ జిల్లా ఎం.కొత్తపట్నానికి చెందిన వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. రామ్ మహరాజ్ పేరుతో రాము తన ‘ఫేస్ బుక్’ ఖాతాను నిర్వహిస్తున్నాడని చెప్పారు. సుచరితపై అభ్యంతరకర పోస్టు చేసినట్టుగా అందిన ఫిర్యాదు మేరకు రాముపై గుంటూరులోని పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు.
Andhra Pradesh
Home minister
Sucharita
youth

More Telugu News