Andhra Pradesh: టీడీపీ నేతలు ఇంకా మోసాలతోనే బతకాలని చూస్తున్నారు: ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి

  • రైతులపై టీడీపీ నేతలది కపట ప్రేమ
  • చంద్రబాబు, లోకేశ్  ట్వీట్లను రైతులు చూస్తారా? 
  • వారం రోజుల్లోగా రైతులకు విత్తనాలు అందిస్తాం
ఏపీ ప్రభుత్వం రైతులకు ఇంకా విత్తనాలు అందజేయకపోవడంపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్, వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి స్పందించారు. టీడీపీ నేతలు ఇంకా మోసాలతోనే బతకాలని చూస్తున్నారని, రైతులపై టీడీపీ నేతలు ఇంకా కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్ లు ట్వీట్లు చేస్తే రైతులు చూస్తారనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. వారం రోజుల్లోగా రైతులకు విత్తనాలు అందిస్తామని నాగిరెడ్డి పేర్కొన్నారు.
Andhra Pradesh
YSRCP
Telugudesam
agriculture
vice chairman
Nagireddy

More Telugu News