Sonia Gandhi: దేశ సంపదను అతి తక్కువ ధరకు అమ్మేస్తున్నారు: సోనియా గాంధీ ఆరోపణ

  • తక్కువ ధరకే అత్యుత్తమ రైల్వే కోచ్‌ల తయారు
  • భారతీయ రైల్వేలోనే ఆ ఫ్యాక్టరీ అధునాతనమైంది
  • ఆరు రైల్వే ఉత్పత్తుల కేంద్రాల ప్రైవేటీకరణకు నిర్ణయం
దేశ సంపదను అతి తక్కువ ధరకు ప్రైవేటు వారికి అమ్మేయాలని చూస్తున్నారని, దీని వల్ల వేల మంది నిరుద్యోగులుగా మిగిలిపోతారని యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ పేర్కొన్నారు. నేడు లోక్ సభలో జీరో అవర్‌లో సోనియా గాంధీ మాట్లాడుతూ, సంస్థల ప్రైవేటీకరణకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు.

‘మేకిన్ ఇండియా’కు సాయంగా రాయబరేలీలోని రైల్వే మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీని యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించామని తెలిపారు. ఆ ఫ్యాక్టరీ తక్కువ ధరకే అత్యుత్తమ రైల్వే కోచ్‌లను తయారు చేస్తోందని, భారతీయ రైల్వేలోనే ఆ ఫ్యాక్టరీ అధునాతనమైందన్నారు. దేశంలోని ఆరు రైల్వే ఉత్పత్తుల కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకుందని సోనియా ఆరోపించారు. వాటిలో మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీ ఒకటన్నారు. గతంలో ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌ను ప్రస్తుతం అలా ప్రవేశపెట్టకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sonia Gandhi
Central Government
Modern Coach Factory
Railway Budget
Zero Hour
Parliament

More Telugu News