Andhra Pradesh: చంద్రబాబు ఇంకా తానే సీఎం అనే అపోహలో ఉన్నారు: హోం మంత్రి సుచరిత

  • చంద్రబాబుకు భద్రత తగ్గించామనడం వాస్తవం కాదు
  • బుల్లెట్ ప్రూఫ్, ఎస్కార్ట్ కార్లు ఇచ్చాం
  • బాబు భద్రతకు 58 మందికి బదులు 74 మందిని ఇచ్చాం
ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు భద్రత తగ్గించామనడం వాస్తవం కాదని హోం మంత్రి సుచరిత స్పష్టం చేశారు. చంద్రబాబు ఇంకా తానే సీఎం అనే అపోహలో ఉన్నారని, ప్రతిపక్ష నేతను అనే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని సూచించారు. చంద్రబాబుకు బుల్లెట్ ప్రూఫ్, ఎస్కార్ట్ కార్లు ఇచ్చామని, సెక్యూరిటీ రివ్యూ చెప్పిన దాని కంటే ఎక్కువ భద్రతే కల్పించామని స్పష్టం చేశారు. వాస్తవానికి చంద్రబాబు భద్రతకు 58 మందినే కేటాయించాలి కానీ, 74 మంది ఆయన భద్రత గా ఉన్నారని వివరించారు. చంద్రబాబు ప్రైవేట్ ఆస్తులకు రక్షణ కల్పించడం మాత్రం కుదరదని, ప్రతి విషయం రాజకీయం చేయడం తగదని అన్నారు. అదనపు భద్రత కల్పించాలని చంద్రబాబు కోరితే కల్పిస్తామని సుచరిత పేర్కొన్నారు.
Andhra Pradesh
Chandrababu
Home minister
sucharita
Z plus

More Telugu News