Andhra Pradesh: స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలు నిరంతరం సమీక్షించాలి: సీఎం జగన్ ఆదేశాలు

  • స్పందన కార్యక్రమంపై టెలీ కాన్ఫరెన్స్
  • ప్రజల వినతి పత్రాలకు రశీదులు ఇవ్వాలి
  • ప్రతి మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో  కాన్ఫరెన్స్ నిర్వహిస్తా
ఏపీలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ప్రజల వినతి పత్రాలకు రశీదులు ఇవ్వాలి అని, ఫలానా తేదీ లోగా పరిష్కరిస్తామని రశీదులపై రాసి ఇవ్వాలని, ఇచ్చిన రశీదులను కంప్యూటరీకరించాలని ఆదేశించారు.

ఇచ్చిన రశీదులను డేటా బేస్ లో పెట్టాలని, కలెక్టర్లు, ఎస్పీలు నిరంతరం సమీక్షించాలని, ఆకస్మిక తనిఖీలు చేయాలని, తాను కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని చెప్పారు. గడువులోగా సమస్య పరిష్కరిస్తున్నారో లేదో కచ్చితంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ‘రచ్చబండ’లో భాగంగా స్పందన కార్యక్రమాన్ని పరిశీలిస్తానని, ప్రతి మంగళవారం అరగంట సేపు కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని అన్నారు. సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంపై మంగళవారం సమీక్షిస్తానని జగన్ తెలిపారు.
Andhra Pradesh
SP`s
Collector`s
cm
jagan

More Telugu News