lathasri: ఆ దర్శకుడి తీరు చూసి, ఇండస్ట్రీకి ఎందుకొచ్చానురా దేవుడా అనిపించింది: నటి లతాశ్రీ

  • మమ్ముట్టి సరసన ఛాన్స్ వచ్చింది 
  • ఆ దర్శకుడి మనసులో ఏముందో అర్థం కాలేదు
  •  షూటింగు మధ్యలో వెళ్లిపోయాను     
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో నటి లతాశ్రీ మాట్లాడుతూ, కెరియర్ పరంగా తనకి ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గురించి ప్రస్తావించారు. "చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చినా, ఇచ్చిన పాత్రలను అర్థం చేసుకుంటూ వెళుతుండేదానిని. ఒక మలయాళం సినిమా చేస్తున్నప్పుడు మాత్రం,'ఇండస్ట్రీకి ఎందుకొచ్చామురా దేవుడా' అనిపించింది.

మలయాళంలో మమ్ముట్టి సరసన కథానాయికగా ఒక అవకాశం వచ్చింది. పెద్ద హీరో సరసన కావడంతో, నా పాత్ర గురించి అడక్కుండా ఓకే అనేశాను. కానీ నేను ఏ సీన్ చేసినా ఆ దర్శకుడు ఓకే చెప్పడం లేదు. ఎలా చేసినా ఓకే కాదంటాడు. ఆయన మనసులో ఏముందో నాకు అర్థం కాలేదు. ఇక ఆయనతో సరిపడదనే విషయం అర్థమై, నేను చేయను అని చెప్పేసి మధ్యలోనే వెళ్లిపోయాను. ఆ తరువాత ఆ పాత్రను దివ్యవాణి చేశారు" అని చెప్పుకొచ్చారు.
lathasri

More Telugu News