jagan: మాకు న్యాయం చేయండి: జగన్‌ నివాసం ఎదుట ఆరోగ్యమిత్రల ఆందోళన

షార్ట్స్‌లో చూడండి
అమరావతి సమీపంలోని తాడేపల్లిలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద ఆరోగ్యమిత్రలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం కొత్తగా నియమిస్తున్న గ్రామ వాలంటీర్లకు తమ విధులను అప్పగించనున్నారనే సమాచారం తమ వద్ద ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. జీతం లేకపోయినా కమిషన్ ప్రాతిపాదికన తాము పని చేస్తున్నామని చెప్పారు. తమ భయాందోళనలపై జగన్ స్పందిచాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం 13 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఆరోగ్యమిత్రలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తమను అడ్డుకున్న పోలీసులపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వాగ్వాదానికి దిగారు. 
Go Back to Shorts
jagan
arogyamithra
protest
ysrcp

More Telugu News