bharathi raja: ఇదేమి ప్రజాస్వామ్యం?.. ఏకగ్రీవ ఎన్నికను తిరస్కరించిన భారతీరాజా!

  • దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన భారతీరాజా
  • ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో రాజీనామా
  • ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవాలన్నదే తన ఆకాంక్ష అని వ్యాఖ్య
తమిళ దర్శక సంఘం అధ్యక్ష పదవికి ప్రముఖ దర్శకుడు భారతీరాజా రాజీనామా చేశారు. దర్శకుల సంఘానికి జరుగుతున్న ఎన్నికల్లో భారతీరాజా నామినేషన్ వేశారు. గత నెల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే, మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు.

 అయితే, తాను ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో పదవికి భారతీరాజా రాజీనామా చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో గెలవాలనేదే తన అభిమతమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈనెల 14న ఇతర పదవులకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అదే రోజున మళ్లీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనే విషయం తేలాల్సి ఉంది.
bharathi raja
directors association
resign
kollywood

More Telugu News