BJP: ఇక్కడ మమ్మల్ని నడిపించే నాయకుడు కావాలి... చంద్రబాబు వద్దకు అనంత నేతలు!

  • బీజేపీలో చేరిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే
  • నాయకుడు లేక తెలుగు తమ్ముళ్ల దిగాలు
  • కొత్త నేత ఎంపిక త్వరలోనే
తమను నడిపించే నాయకుడు కావాలని కోరుతూ అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలు, చంద్రబాబును కలవాలని నిర్ణయించారు. ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ బీజేపీలో చేరిన నేపథ్యంలో, పార్టీని ముందుండి నడిపించే నేత లేకుండా పోవడంతో టీడీపీ నాయకులు అయోమయంలో పడ్డారు.

నియోజక వర్గంలో పార్టీని తిరిగి బలోపేతం చేసే సత్తా ఉన్న నాయకుడు తమకు కావాలంటూ, జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో పలువురు వ్యాఖ్యానించగా, విషయాన్ని చంద్రబాబుకు చేరవేసి, మరో నేతను ఎంపిక చేయాలని కోరనున్నట్టు అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్ధసారథి వెల్లడించారు. ఇన్ చార్జ్ ఎంపికపై అభిప్రాయాలను సేకరించి, ఆపై చంద్రబాబు వద్దకు వెళ్లి, పార్టీ ఇన్ చార్జ్ ని ప్రకటిస్తామని ఆయన అన్నారు.
BJP
Telugudesam
Anantapur District
Dharmavaram
Gonuguntla

More Telugu News