Varla Ramaiah: అయ్యా, ముఖ్యమంత్రి గారూ... మీ దృష్టిని పెట్టగలరా?: వర్ల రామయ్య

  • వైసీపీ కార్యకర్తల దాడులు
  • గ్రామాలను వదిలి వెళుతున్న టీడీపీ కుటుంబాలు
  • ప్రేక్షక పాత్ర వహిస్తున్న పోలీసులు
  • ఆరోపించిన వర్ల రామయ్య
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్న దాడులతో పలు గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన కుటుంబాల వారు వెళ్లిపోతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి పెట్టగలరా? అని ప్రశ్నించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. "అయ్యా! ముఖ్యమంత్రి గారు, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం నుండి కొన్ని గ్రామాలలో తెలుగుదేశం కార్యకర్తలు మీ కార్యకర్తల అరాచకాలకు భయపడి గ్రామాలు వదలి వలస వెళ్లారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. మీ దృష్టి పెట్టగలరా?" అని అడిగారు. 
Varla Ramaiah
YSRCP
Jagan
Telugudesam
Twitter

More Telugu News