Social Media: సీఎం జగన్‌పై అసభ్యకర పోస్టులు పెట్టిన దాసరి కిరణ్ అరెస్ట్

  • ఎమ్మెల్యే కేతిరెడ్డిపైనా అనుచిత పోస్టులు
  • సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
  • రెచ్చగొట్టే పోస్టులు పెడితే మూల్యం చెల్లించకతప్పదన్న డీఎస్పీ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన దాసరి కిరణ్ అనే వ్యక్తిని తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాను చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సూచించారు. గిట్టని వారిపై అనుచిత పోస్టులు తగవన్నారు. రెచ్చగొట్టే పోస్టులు పెడితే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని డీఎస్పీ హెచ్చరించారు.
Social Media
Jagan
tadipatri
Police
Andhra Pradesh

More Telugu News