Sri Lanka: సగం వికెట్లు కోల్పోయిన విండీస్... ఆశలన్నీ బ్రాత్ వైట్, పూరన్ జోడీపైనే!

షార్ట్స్‌లో చూడండి
చెస్టర్ లీ స్ట్రీట్ లో శ్రీలంక జట్టుతో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో 339 పరుగుల భారీ లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 145 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకుంది. గేల్, హోప్, హెట్మెయర్ వంటి భారీ హిట్టర్లు, కెప్టెన్ జాసన్ హోల్డర్ సైతం పెవిలియన్ చేరిన వేళ కరీబియన్ల ఆశలన్నీ నికోలాస్ పూరన్ (53), కార్లోస్ బ్రాత్ వైట్ (26)పైనే ఉన్నాయి. ప్రస్తుతం విండీస్ స్కోరు 33 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు. విజయానికి ఇంకా 17 ఓవర్లలో 159 పరుగులు చేయాలి. లంక బౌలర్లలో మలింగ రెండు వికెట్లు తీయగా, రజిత, వాండర్సే చెరో వికెట్ దక్కించుకున్నారు.
Go Back to Shorts
Sri Lanka
West Indies
World Cup

More Telugu News