Sri Lanka: ఫెర్నాండో సెంచరీ... వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యాన్నుంచిన శ్రీలంక

  • శ్రీలంక స్కోరు 50 ఓవర్లలో 338/6
  • సమష్టిగా రాణించిన లంకేయులు
  • వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో వెస్టిండీస్ పై శ్రీలంక భారీ స్కోరు సాధించింది. మ్యాచ్ ఫలితానికి ఎలాంటి ప్రాధాన్యత లేకపోయినా, లంకేయులు మాత్రం తొలిసారి సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. ఆవిష్క ఫెర్నాండో (104) సెంచరీతో అదరగొట్టినవేళ, లంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 338 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ పెరెరా 64 పరుగులు సాధించగా, చివర్లో లహిరు తిరిమన్నే 33 బంతుల్లో 45 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో కెప్టెన్ జాసన్ హోల్డర్ 2 వికెట్లు, కాట్రెల్, థామస్, అలెన్ తలో వికెట్ తీశారు.
Sri Lanka
West Indies

More Telugu News