Madhavan: పుత్రోత్సాహంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న నటుడు మాధవన్

  • జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో మాధవన్ తనయుడి ప్రతిభ
  • 3 స్వర్ణాలు, ఒక రజతంతో సత్తాచాటిన వేదాంత్
  • ట్వీట్ చేసిన మాధవన్
హీరోగా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సుప్రసిద్ధుడైన మాధవన్ తన పుత్రుడు వేదాంత్ సాధించిన ఘనతల పట్ల పొంగిపోతున్నాడు. మాధవన్ తనయుడు వేదాంత్ జాతీయస్థాయి స్విమ్మింగ్ లో విశేష ప్రతిభ చూపించాడు. జూనియర్ లెవల్లో జరిగిన నేషనల్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్ లో వేదాంత్ ఏకంగా 3 స్వర్ణ పతకాలు గెలుచుకోవడమే మాధవన్ సంతోషానికి కారణం. వ్యక్తిగత ఈవెంట్లలో వేదాంత్ సాధించిన మొదటి పతకాలు ఇవే. ఈ ఆనందాన్ని మాధవన్ అభిమానులతో పంచుకున్నాడు. "మీ అందరి దీవెనలతో వేదాంత్ గర్వపడేలా చేశాడు, దేవుడి దయ వల్ల అతనికి విజయాలు లభించాయి. జూనియర్ స్విమ్మింగ్ పోటీల్లో 3 గోల్డ్, ఒక సిల్వర్ మెడల్ గెలిచాడు. మా అబ్బాయి తదుపరి లక్ష్యం ఆసియా క్రీడలే" అంటూ మాధవన్ ట్వీట్ చేశాడు.
Madhavan
Vedanth
Swimming

More Telugu News