Sri Lanka: పసలేని వెస్టిండీస్ బౌలింగ్... భారీస్కోరు దిశగా శ్రీలంక

  • 39 ఓవర్లలో 3 వికెట్లకు 247 పరుగులు
  • ఆవిష్క ఫెర్నాండో క్లాస్ ఇన్నింగ్స్
  • ఓపెనర్ల శుభారంభం
వెస్టిండీస్ తో మ్యాచ్ లో శ్రీలంక భారీస్కోరు దిశగా పయనిస్తోంది. టాపార్డర్ బ్యాట్స్ మెన్ సమష్టిగా కదంతొక్కడంతో 39 ఓవర్లలో 3 వికెట్లకు 247 పరుగులు చేసింది. ఆవిష్క ఫెర్నాండో 74, ఏంజెలో మాథ్యూస్ 26 పరుగులతో ఆడుతున్నారు. అంతకుముందు, వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక జట్టుకు కెప్టెన్ కరుణరత్నే (32), కుశాల్ పెరెరా (64) జోడీ తొలి వికెట్ కు 93 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చింది. జీవన్ మెండిస్ కూడా 39 పరుగులతో రాణించాడు.  టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నా, పేలవమైన బంతులతో విండీస్ బౌలర్లు తేలిపోయారు. ఏ దశలోనూ లంక బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టలేకపోయారు.
Sri Lanka
West Indies
World Cup

More Telugu News