Shiv Sena: టీమిండియా జెర్సీపై వ్యాఖ్యలు చేసిన ముఫ్తీని లక్ష్యంగా చేసుకున్న శివసేన

  • భారత్ ఓటమికి కొత్త జెర్సీనే కారణమన్న మెహబూబా ముఫ్తీ
  • తీవ్రంగా స్పందించిన శివసేన
  • ముఫ్తీని పిచ్చాసుపత్రిలో చేర్చాలంటూ ఫైర్
ఎప్పుడూ బ్లూ జెర్సీలతో మైదానంలో దిగే టీమిండియా తొలిసారి ఆరెంజ్ కలర్ జెర్సీలతో దిగి ఓడిపోవడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ, కొత్త జెర్సీ కారణంగానే టీమిండియా ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. కాషాయ రంగులో ఉన్న జెర్సీ కలిసిరాలేదని అన్నారు. దీనిపై శివసేన వర్గాలు మండిపడ్డాయి. టీమిండియా ఓటమికి జెర్సీనే కారణమంటూ వ్యాఖ్యలు చేస్తున్న ముఫ్తీని వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్చాలంటూ శివసేన అగ్రనేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ముఫ్తీ వ్యాఖ్యలను సమర్థించలేం,  పాకిస్థాన్ జట్టు తమ సొంత గ్రీన్ కలర్ జెర్సీ ధరించి కూడా ఓడిపోయింది. దీన్ని ఎలా భావించాలి?' అంటూ రౌత్ వ్యాఖ్యానించారు.
Shiv Sena
Mufti
Team India
Jersey

More Telugu News