kiara advani: కైరా అద్వానీకి గిఫ్ట్ పంపిన విజయ్ దేవరకొండ

  • సూపర్ హిట్ అయిన హిందీ 'అర్జున్ రెడ్డి'
  • తనకెంతో ఇష్టమైన డ్రెస్ ను కైరా అద్వానీకి పంపిన విజయ్
  • థ్యాంక్స్ చెప్పిన ముద్దుగుమ్మ 
సూపర్ హిట్ అయిన 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని బాలీవుడ్ లో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేశారు. షాహిద్ కపూర్, కైరా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. రూ. 200 కోట్లను రాబట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం విజయానికి గుర్తుగా కైరా అద్వానీకి విజయ్ దేవరకొండ ఓ బహుమతిని పంపాడు. తనకు ఎంతో ఇష్టమైన డ్రెస్ ను గిఫ్ట్ గా పంపుతున్నానని... తప్పుగా అనుకోవద్దని ఒక మెసేజ్ కూడా పంపాడు. గిఫ్ట్ పంపినందుకు విజయ దేవరకొండకు కైరా ధన్యవాదాలు తెలిపింది.
kiara advani
vijay devarakonda
tollywood
bollywood

More Telugu News